గ్రామ దేవతలకు గంగాభిషేకం
నిజామాబాద్ జూన్ 30 (ప్రజాక్షేత్రం):ఆలూర్ మండల కేంద్రంలో విడిసి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామంలో ఉన్న అన్ని దేవతలకు ఆదివారం రోజున గంగ నీళ్లతో అభిషేకం నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించామని వీడీసీ అధ్యక్షులు నల్మెల మోహన్ తెలిపారు. అలాగే ఈ గ్రామదేవతలకు ఆషాడం మాసం కంటే ముందు ఒకసారి శ్రావణమాసం తర్వాత మరోసారి సంవత్సరానికి రెండుసార్లు అభిషేకం నిర్వహిస్తామని ఈ ఆచారం మా పూర్వ పెద్దలు పాటించిన విధంగానే ఇప్పటికి మేము ఇలానే పాటిస్తున్నాము ఇలా దేవతలకు గంగాభిషేకం చేయడం వలన ఊరికి ఏదైనా అరిష్టం ఉంటే తొలగుతుంది అలాగే ఊరు ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని ఇది మా నమ్మకం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.