ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి
చెన్నూరు, జూన్ 30(ప్రజాక్షేత్రం): ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పలు వార్డుల్లో పర్యటించారు. మార మ్మవాడ, బేతాలవాడ, పెద్దవాడలలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. కరెంటు స్తంభాలు, వీధిలైట్లు, డ్రైనేజీల, రోడ్డు, నీటి సమస్యలు న్నాయని తెలుపగా మున్సిపల్ అధికారు లను పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభు త్వం పనిచేస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ముదిరాజ్ కులస్తుల ఇలవేల్పు పెద్దమ్మ తల్లిని ఎమ్మెల్యే దర్శించుకుని పూజలు చేశారు.
*ఎమ్మెల్యేకు రైతుల వినతి*
భీమారం : చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి మంచిర్యాలకు వెళ్తుండగా మండల కేంద్రంలోని హైవే రోడ్డు వద్ద గొల్లవాగు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు కలిసి వినతిపత్రం అందించారు. రైతులు మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో పొలాలకు నీరు చేరకుండా ప్రాజెక్టు అధికారులు ఇబ్బందులు పెట్టడంతో రెండు తడులకు నీరం దకుండ వరి పంట ఎండిపోయిందని తెలిపారు. ఈసా రైనా పంట పొలాలకు నీరందించి ఆదుకునేలా అధికారులతో మాట్లాడాలని విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.