Praja Kshetram
తెలంగాణ

*తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌*

 

 

 

 

హైదరాబాద్ జులై 01(ప్రజాక్షేత్రం): తెలంగాణలో ఎనిమిది మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోష్‌ పంకజ్‌, సిరిశెట్టి సంక్రీత్‌ గవర్నర్‌ ఏడీసీగా, ములుగు ఓఎస్‌డీగా గీతే మహేశ్ బాబాసాహేబ్‌ను నియమించింది. సౌత్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా పాటిల్‌ కాంతిలాల్‌ సుభాష్‌, భద్రచాలం ఏఎస్పీగా అంకిత్‌ కుమార్‌ శంఖవార్‌, భైంసా ఏఎస్పీగా అవినాశ్‌కుమార్‌, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రినిరెడ్డి, ఏటూరు నాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గత నెలలో ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీలు చేసిన విషయం తెలిసిందే. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. పలుజోన్ల డీసీపీలను సైతం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నది.

Related posts