మొన్న కాంగ్రెస్, నిన్న బిఆర్ఎస్ నేడు కాంగ్రెస్.. ఎమ్మెల్యే కాలే యాదయ్య గమ్యం ఎటు…
-నాడు కాంగ్రెస్ కు మోసం చేసి టిఆర్ఎస్ కు, నేడు బిఆర్ఎస్ ను మోసం చేసి కాంగ్రెస్ కు….
-చేవెళ్లే ఎమ్మెల్యే కాలే యాదయ్య నమ్మిన కార్యకర్తల పరిస్థితి ఏంటి…..?
మొయినాబాద్ జూలై 01(ప్రజాక్షేత్రం): నేడు చేవెళ్ల నియోజకవర్గం లో ఎక్కడ నలుగురు కూర్చున్న గ్రామాల్లో పెద్ద మనుషులు రచ్చబండపై సూర్యోదయం మొదలుకొని ఎక్కడ నలుగురు యువకులు నిలబడిన చేవెళ్ల నియోజకవర్గం లో ప్రజలను నోట్లో నుంచి చర్చిస్తున్న విషయం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గురించి.. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య నమ్మిన కార్యకర్తలను నమ్మి ఆయన గెలుపు కోసం అహర్నిశలు కృషిచేసి తన సొంత వాళ్లను కూడా సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే యాదయ్య గెలుపు కోసం పనిచేసి సొంతవారికి దూరమైన కార్యకర్తల పరిస్థితి ఏంటని ఎవరికి వారు ప్రశ్నించుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఈ చర్చే ప్రజలకు చర్చనీయాంశంగా మారింది.. గత నెల 28వ తేదీన శుక్రవారం నాడు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య టిఆర్ఎస్ పార్టీలో గెలిచి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలోకి కండువా వేసుకొని చేరడం జరిగింది. ఆయన చేరిన వెంటనే సోషల్ మీడియాలో నియోజకవర్గం స్థాయిలో అటు ఇటు ఎక్కడ నలుగురు నిలబడ్డ ప్రజల నోట్లో నుండి చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదపై అలుపెరగని చర్చ జరుగుతుంది. 2014లో కాంగ్రెస్ పార్టీలో గెలిచినాడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కార్యకర్తలని నమ్మించి మోసం చేసి 2014లో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి కోసమే వెళ్తున్నానని నాకు ఎలాంటి ఆస్తులపైన పదవుల పైన ఆశ లేదని చెప్పిన కలే యాదయ్య నేడు టిఆర్ఎస్ పార్టీలో గెలిచి తిరిగి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి బి ఆర్ ఎస్ పార్టీలో ఆయన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు నాయకులు ఉండి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఆయన అణిచివేసిన విధానాన్ని మరిచి తిరిగి టిఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ లో చేరడంపై పెద్ద చర్చని అంశంగా మారింది. నేటిజనులు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే యాదయ్య పై తీవ్ర దుమ్మెత్తి పోస్తున్నారు. నాడు నియోజకవర్గం అభివృద్ధి కోసం అని అధికార పార్టీలోకి వెళ్లి కుసుమంత కూడా అభివృద్ధి చేయని కాలయాదయ నేడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసమని తగలబాలు పలుకుతుంటే దయాలు వేదాలు వల్లిస్తున్నట్టుందని సామాన్య జనులు అటు బి ఆర్ ఎస్ కార్యకర్తలు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడుతున్న మాట.. కాలే యాదయ్య కాంగ్రెస్లోకి రావడం కార్యకర్తలకు ఇష్టం లేకున్నా అధిష్టానం పునరాలోచన చేయాలని కలే యాదయ్య సభ్యత్వాన్ని రద్దు చేయాలని సాధారణ ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ మండలం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుర్రాల భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గత పది సంవత్సరాలుగా కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పరిస్థితి ఏంటని. ఆయనను నమ్మి టిఆర్ఎస్ పార్టీలో గెలిపించిన నాయకులు కార్యకర్తలు పరిస్థితిలు ఏంటని ఎటు చూసినా కలే యాదయ్య ఆయన రాజకీయ ప్రస్థానం నుంచి నేటి వరకు చేవెళ్ల నియోజకవర్గం ప్రజలను మోసం చేస్తూ ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి ఆయన అధికార పార్టీలో ఉండి ఆయన చలామణి సాగించుకోవడానికి తప్ప చేవెళ్ల నియోజకవర్గం ప్రజల అభివృద్ధికి ఏమాత్రం నోచుకోవడని ఆయన అధికార పార్టీలోకి వెళ్లి అభివృద్ధి చేస్తానని చెప్పి నియోజకవర్గంలో ఎక్కడి పనులు అక్కడే పెండింగ్లో ఉండి నిత్యం నరకయాత్ర అనుభవిస్తున్న రోడ్లు పరిస్థితి ఏమీ మారలేదని ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చి ఏం చేస్తాడని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన కాలే యాదయ్య వర్గీయులకు ఆయన నమ్మిన కార్యకర్తలకు ఆయన వెంట వచ్చిన కార్యకర్తలకు ఎలాంటి స్థానిక పదవులు గాని స్థానిక ఎన్నికల్లో పోటీ పార్టీ గుర్తు పంపకంలో విషయంలో కాలే యాదయ్యకు ఎలాంటి అధికారం ఇవ్వద్దని అధిష్టానాన్ని యావత్ నియోజకవర్గం స్థాయి కార్యకర్తలమంతా అధిష్టానానికి పిలుపునిస్తున్నామని ఆయన అన్నారు. మేము కాంగ్రెస్ పార్టీలో భీమ్ భరత్ గెలుపు కోసం ఎంతో కృషి చేస్తామని ఎప్పటికన్నా మేమంతా ఆయన వర్గీయులమేనని కాంగ్రెస్ పార్టీ భీమ్ భరత అన్న కు పార్టీలో ఏమైనా వన్నె తగ్గిన కార్యకర్తలను చూస్తూ ఊరుకోమని అది స్థానానికి చేతులు జోడించి విన్నవిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.