సంగారెడ్డి ఆత్మకమిటీ చైర్మెన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వై ప్రభు.
-వ్యవసాయ అభివృద్ధిలో ఆత్మ కమిటీలు కీలకంగా ఉండాలి.
-వచ్చే ఎన్నికల్లో అప్పులు చేసి భూములమ్మి అయినా సరే గేల్వలే.
-టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.
కొండాపూర్ జూలై 01(ప్రజాక్షేత్రం): వ్యవసాయ రంగంలో ఆత్మ కమిటీలది కీలక భూమిక ఉంటుందని పంటల సాగు, రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సోమవారం మల్కాపూర్ లోని గోకుల్ ఫంక్షన్ హాల్ లో సంగారెడ్డి డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా వై ప్రభూ, 23మంది డైరెక్టర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షురాలు కార్పొరేషన్ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి తో కలిసి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరై మాట్లాడుతూ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. నూతన వ్యవసాయ పద్ధతులు ఆధునికంగా వ్యవసాయ సాగు పై రైతులకు లక్ష్యం కల్పించేందుకు ఆత్మ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. రైతుల అభివృద్ధి కోసం రైతులకు శిక్షణ, పంటల ప్రదర్శన క్షేత్రాలను చేపట్టి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి పంటలు దిగుబడి అధికంగా వచ్చేలా చూడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలను త్వరలోనే అమలు చేసి రైతుల కు సంక్షేమ పథకాలు అందిస్తామని, ఆధునిక సాంకేతికతతో పంటలు సాగు చేసే అధిక లాభాలతో పాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి రంగంలో తీసుకోగలుగుతామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మనోహర, ఎంపీటీసీ నరసింహారెడ్డి, సొసైటీ చైర్మన్ లో ఎల్ శ్రీకాంత్ రెడ్డి, మాణిక్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గడిల రామిరెడ్డి, మల్లారెడ్డి, విఠల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.