ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం
-కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీ ఎస్ ఎస్ ఓ అధ్యక్షులు లక్ష్మీ నివాస్
కొత్తకోట జులై 01(ప్రజాక్షేత్రం): కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మీ నివాస్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నివాస్ మాట్లాడుతూ ప్రపంచంలో గొప్ప వృత్తి ఏదైనా ఉంది అంటే అది డాక్టర్ వృత్తే అని అన్నారు. అందుకే వైద్యులను దేవుళ్ళతో పోలుస్తారని చెప్పారు. చావు బతుకుల్లో ఉన్న వ్యక్తులకు జీవం పోసి ప్రాణాలు కాపాడే వారు వైద్యులని వీరి సేవలను వెలకట్టలేమని పేర్కొన్నారు. కరోనా సమయంలో వైద్యులు చేసిన సేవలు మరువలేనివని ఎందరో ప్రాణాలకు ఊపిరిపోసి మహనీయులు డాక్టర్లు అని వారి సేవలను కొనియాడారు. అదేవిధంగా వైద్యం అంటే వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న డాక్టర్లు అందరు దేవుళ్ళతో సమానమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీల మండల అధ్యక్షులు శ్రీశైలం, టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర నాయకులు కర్రే సుదర్శన్, వెంకట్ కృష్ణ జోషి మెడికల్ ఆఫీసర్ ఆసియా బేగం, ఆయుష్ డాక్టర్ మంజుశ్రీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.