ప్రజావాణిలో పురుగుల మందు తాగిన రైతు
గద్వాల జూలై 01(ప్రజాక్షేత్రం):జోగులాంబ గద్వాల జిల్లా,ఐజా మండలము, గుడిదొడ్డి గ్రామానికి చెందిన రైతు పరశురాముడు భూమిని ఇతరులు కబ్జా చేశారని కలెక్టర్ ఛాంబర్ లో ప్రజావాణి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు పోలీసులు గమనించి రైతు పరశురాముడు ను హాస్పిటల్ కు తరలించారు. అతనికున్న ఐదు ఎకరాల భూమిని ఇదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేయడంతో, పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.