Praja Kshetram
తెలంగాణ

దీర్ఘాయుష్షును ప్రసాదించే మహోత్తర వృత్తి వైద్య వృత్తి

దీర్ఘాయుష్షును ప్రసాదించే మహోత్తర వృత్తి వైద్య వృత్తి

 

 

శంకర్‌ పల్లి జూలై 01(ప్రజాక్షేత్రం): ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడి దీర్ఘాయుష్షును అందించే మహోత్తరమైన వృత్తి వైద్యవృత్తి అని సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ శంకర్‌ పల్లి మండల చైర్మన్ రాజేష్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం డాక్టర్స్ డే సందర్భంగా పట్టణానికి చెందిన అలారా డయాగ్నొస్టిక్స్ వైద్యులు డాక్టర్ రమేష్ గౌడ్, డాక్టర్ విద్యా రాణి, మెగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ చైతన్య రెడ్డి లను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వైద్యులను గౌరవించి.. వారి సేవలను గుర్తించాలని కోరారు.

Related posts