స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి
– మైలారం సుబ్రహ్మణ్యం
షాద్ నగర్ జులై 01(ప్రజాక్షేత్రం): సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మైలారం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 700 కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రీబర్స్మెంట్ పెండింగ్ లో ఉందన్నారు. స్కాలర్షిప్, ఫీ రియంబర్స్మెంట్ ఆధారంగా చదువుకునే పేద విద్యార్థుల సకాలంలో చెల్లించకపోవడం వల్ల వారి చదువు మధ్యలోనే ఆగిపోతుందని విచారం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం సరికాదన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలోని అనేక మండలాల్లో గల ప్రైవేటు పాఠశాలల తీరు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు, పుస్తకాలు దుస్తులు అమ్మడం, అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మల్చుకుంటున్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో సామాన్యులకు ఒక విద్య, డబ్బు ఉన్న వాళ్లకు మాత్రమే ఉన్నత ప్రమాణాలతో విద్య అందుతుందని ప్రజలు భావిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే జోరుగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. సామాన్య విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బు లేక నాణ్యమైన విద్య అందించలేకపోతున్నామని మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక వస్తువులు లేక విద్యార్థులు కూడా ప్రతిభావంతులుగా రాణించలేకపోతున్నారు. స్వతంత్ర భారతదేశంలో విద్య వైద్యం పేద వాళ్లకు అందడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలపై మండల విద్యాధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో(ఎం ఈ ఓ)ల తనిఖీలు చేయకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంతగానో నష్టపోతున్నారు. ఎంతోమంది విద్యా అధికారులు ఉన్నప్పటికీ పర్మిషన్లు లేకుండా కళాశాల, పాఠశాలలు ఎలా నిర్వహిస్తున్నారు. అనే ప్రశ్నా ప్రజలలో తలెత్తుతుంది. విద్యా హక్కు చట్టం ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ విద్య కూడా అసమానతలకు గురవుతుంది. పేదలకు ఇప్పటికైనా సమాన విద్య అందించాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులు ప్రైవేటు కళాశాల, పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము.