Praja Kshetram
తెలంగాణ

ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం

ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం

 

 

 

నిజామాబాద్ జులై 01(ప్రజాక్షేత్రం) సోమవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆలూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వైద్యులు అందరికీ పూల శాలువాతో సత్కరించి. వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్లు అరుణ్, రజినీకాంత్, జ్ఞానేశ్వర్, శ్రీను, వికాస్, కిషన్, దేవన్నను సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ గ్రామ సర్పంచ్ పల్లె మోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న డాక్టర్ లందరికీ శాలువాతో సత్కరించామని వారి వైద్యం గ్రామంలో ప్రతి ఒక్కరికి అందుతుందని రాత్రి పగలు అనే తేడా లేకుండా వారి సేవలను ప్రజలకు అందజేస్తున్నారు. కావున వారికి మా యొక్క చిరు సత్కారం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ దుమ్మాజి శ్రీనివాస్,మూలకీడి ఎంపీటీసీ మల్లేష్, శ్రీనివాస్, నాడిశరం మల్లయ్య, మధు చారి, తదితరులు పాల్గొన్నారు.

Related posts