Praja Kshetram
తెలంగాణ

రైతుల సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తా.

రైతుల సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తా.

 

*-ఆత్మ కమిటీ చైర్మన్ వై.ప్రభు.*

 

కొండాపూర్ జూలై 02(ప్రజాక్షేత్రం):సంగారెడ్డి నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన వై ప్రభు మంగళవారం మల్కాపూర్ చింతల్ ప్రాంతంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి తనకు సంగారెడ్డి నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ పదవి రావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండి రైతుల సమస్యలు సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడి రైతులకు ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తానని అన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన తనకు ఆత్మ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర కేంద్ర నిధులను రైతులతో పాటు అధికారులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఉపయోగపడే పనులకు కేటాయిస్తా అన్నారు. త్వరలోనే రైతులకు రెండు లక్షలరుణమాఫీ అవుతుందనిరైతులకు రుణమాఫీ చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొండాపూర్ ఎంపిటిసి నరసింహారెడ్డి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లారెడ్డి,తోగర్ పల్లి మాజీ సర్పంచ్ ప్రభాకర్ లు ఉన్నారు.

Related posts