యదేచ్చగా రోడ్లపై తిరుగుతున్న కేజీవీల్ ట్రాక్టర్లు
నిజామాబాద్ జులై 02(ప్రజాక్షేత్రం): నిజామాబాద్ జిల్లాలో రైతన్నల పొలం నాట్లు మొదలయ్యాయి. గ్రామాలలో రోడ్లపై కేజీవిల్ ట్రాక్టర్లు తిరగడం వల్ల ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మించిన రోడ్లు ధ్వంసం అవుతున్న సంబంధిత అధికారులు కేజీలు ట్రాక్టర్లు రోడ్లపై తిరుగుతున్న వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. కేజీవీల్స్ రోడ్లపై నడపడంతో రోడ్లు ధ్వంసం అవుతుండడం గమనించి ఆలూర్ మండలంలో ఓ రైతు ఈ ట్రిక్కుని ఫాలో అయ్యాడు.మరో ట్రాక్టర్ తో కేజీ వెళ్లను దానిపై తీసుకువెళ్లి పొలంలో దమ్ చేసి నాటు వేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా రోడ్లు పాడవకుండా కాపాడుకోవచ్చని అన్నారు. విచ్చలవిడిగా కేజ్విల్స్ రోడ్లపై నడిస్తే డ్రైవర్ అన్నలకు భారీగా జరిమానా కూడా పడుతుంది. దీన్ని ఉద్దేశించి తెలివితేటలతో ఇలా కేజీవీల్స్ ని తరలించారు. రోడ్లపై కేజీలు కనబడితే భారీ జరిమానా వేస్తామని అధికారులు తెలిపారు.