అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
అచ్చంపేట,జూలై 2(ప్రజా క్షేత్రం): అచ్చంపేట నియోజకవర్గం లోని నల్లమల ప్రాంతానికి మంగళవారం మంత్ర సీతక్క చేరుకున్న సందర్భంగా మంత్రి సీతక్కకు అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో గల ఆటవిశాఖ వనమాలిక ప్రాంగణంలో అధికార లాంఛనాలతో మంత్రి జూపల్లి కృష్ణారావు,డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, అటవీ శాఖ అధికారులు ఘనంగా స్వాగతం స్వాగతం పలికారు. అటవీ శాఖ పోలీస్ అధికారులతో మంత్రి సీతక్క గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.