ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి.
-యం ఆర్ ఓ కె.వి రంగారెడ్డి.
-టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీ నివాస్.
షాద్ నగర్ జులై 03(ప్రజాక్షేత్రం): తలకొండపల్లి మండల కార్యాలయంలో యం ఆర్ ఓ కె వి రంగారెడ్డి గారితో కలిసి టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.టి ఎస్ ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ….. సమాజంలో ప్రజలు, యువత సామాజిక స్పృహను అలవార్పుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రజలంతా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. చెట్లు లేకుంటే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని, కాలుష్యం మానవ జీవన ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారుతాయన్నారు. కాలుష్యాన్ని తరిమికొట్టాలంటే ప్రతి ఇంటి ఆవరణలో వ్యవసాయ పొలాలలో మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్, రాష్ట్ర నాయకులు కర్రే సుదర్శన్, మీసాల మధు. మీసాల మహేష్, సురేష్, వెంకటేష్, నరేష్ చారి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.