Praja Kshetram
తెలంగాణ

పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందించిన శంకర్ పల్లి వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందించిన శంకర్ పల్లి వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి.

 

 

శంకర్‌ పల్లి జులై 03(ప్రజాక్షేత్రం): విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని, పుట్టిన గడ్డకు, కని పెంచిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని శంకర్‌ పల్లి వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి అన్నారు. పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థికి, ప్రతి సంవత్సరం,ప్రతి ఒక్కరికి నగదు బహుమతి ఇస్తానని, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ యధావిధిగా పొద్దుటూరు గ్రామ ఉన్నత పాఠశాల నుండి 2023- 24 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన పది హేడు మంది విద్యార్థులకు, శంకర్ పల్లి ఎంఈఓ అక్బరుద్దీన్ చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ. పది వేల చొప్పున మొత్తం ఒక్క లక్ష డెబ్బైవేల నగదును అందించారు. ఈ సందర్భంగా ప్రవళిక వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువులను ఆదిలోనే ఆపివేయకుండా ఉన్నత చదువులు చదువుకునే దిశగా ముందుకు సాగాలని, చక్కగా చదువుకొని పుట్టిన గ్రామానికి, కని పెంచిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఇంటర్మీడియట్ విద్య అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ఒక కీలకమైన ఘట్టమని ఈ దశలో సరియైన దిశగా అడుగులు వేసి, ప్రతి విద్యార్థి ఆకాశమే హద్దుగా గొప్ప గొప్ప చదువులు చదవాలని ఆకాంక్షించారు. ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థి భుజం తట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న శంకర్ పల్లి ఎంఈఓ అక్బరుద్దీన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థికి, నగదు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని, పొద్దుటూరు గ్రామ పాఠశాల విద్యార్థులకు బివిపిఆర్ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని, చక్కగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పొద్దుటూరు గ్రామ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts