నేటితో ముగిసిన ఎంపీటీసీల పదవీకాలం
ఆలూర్ జులై 04(ప్రజాక్షేత్రం): ఆలూర్ గ్రామపంచాయతీ ఆవరణలో గత ఐదు సంవత్సరాలు ఎంపీటీసీలుగా బాధ్యతలు నిర్వహించి గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేసిన మండల వైస్ ఎంపీపీ మోతే భోజకాల చిన్నారెడ్డి మరియు ఎంపీటీసీ మర్కంటి లక్ష్మీ మల్లేష్ గార్లను గ్రామ కార్యదర్శి రాజలింగం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిటిసిలు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి మేము గ్రామానికి ఎనలేని సేవలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో ఎలాగైనా మా గ్రామానికి సంఘ భవనాలు,రోడ్లు,నిధులు నియామకాలు,మరెన్నో కొట్లాడి గ్రామానికి తీసుకువచ్చి పనులు జరిపించామని అన్నారు. ఈ ఐదు సంవత్సరాలు మాకు ఎంతో తోడు నీడగా ఉన్న మా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ పదవిలో ఉన్న లేకపోయినా గ్రామానికి ఎన్నో సేవలు చేస్తామని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ దుమ్మాజీ శ్రీనివాస్, ఐకెపి మనోహర్,లైన్మెన్ శివ,కారోబర్ సంతోష్.ఉపాధి హామీ పోశెట్టి, మాజీ వార్డు సభ్యులు,అంగన్వాడి కార్యకర్తలు,ఐకెపి సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.