గ్రామపంచాయతీల అభివృద్ధే లక్ష్యం – ఎంపిటిసి రామ్ రెడ్డి….
మొయినాబాద్ జూలై 04(ప్రజాక్షేత్రం): గ్రామపంచాయతీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని ఎంపిటిసి రామ్ రెడ్డి అన్నారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిలోని శ్రీరామ్ నగర్ గ్రామంలో చేపట్టిన సిసి రోడ్డును ప్రారంభించారు. అభివృద్ధి పనులకు గాను 3 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ మండల అధ్యక్షులు తమ్మలి మణయ్య, మాజీ ఎంపిటిసి సిహెచ్ మాధవరెడ్డి, సీనియర్ నాయకులు ఆర్ మల్లేశం, సత్యనారాయణ, ఏ శ్రీనివాస్ రెడ్డి, బిక్షపతి, గ్రామ అధ్యక్షులు సత్యనారాయణ, మాజీ వార్డ్ మెంబర్లు ఎం ప్రభాకర్, ఎం డేవిడ్, కే మహేందర్, విటల్, రాఘవులు, భరత్, మల్లేష్, మైపాల్, ప్రవీణ్, రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.