Praja Kshetram
తెలంగాణ

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను కలిసిన శంకర్ పల్లి పిఎసిఎస్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి.

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను కలిసిన శంకర్ పల్లి పిఎసిఎస్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి.

 

 

శంకర్ పల్లి జూలై 04 (ప్రజాక్షేత్రం):చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్యను మహాలింగాపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, శంకర్ పల్లి పిఎసిఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి అతని అనుచరులు గురువారం నవాబు పేట్ మండలం చించల్పేట్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకే అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గ్రామాలలోని నాయకులు కార్యకర్తలు శాంతియుతంగా ఉంటూ గ్రామ అభివృద్ధి పై శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాలింగాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్, కంది గోవర్ధన్ రెడ్డి, శ్రీధర్, ఖాజా ఖాన్, తాళ్ల రాములు, గూని సత్యం, బోడో ప్రశాంత్ పాల్గొన్నారు.

Related posts