Praja Kshetram
తెలంగాణ

త్రికరణ శుద్ధితో ఎమ్మార్పీఎస్ జెండావిష్కరణ పండుగ. 

త్రికరణ శుద్ధితో ఎమ్మార్పీఎస్ జెండావిష్కరణ పండుగ.

 

-ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ళ నరసింహ మాదిగ.

-జులై 7న గ్రామ గ్రామాన కదలండి

షాద్ నగర్ జులై 04(ప్రజాక్షేత్రం): అణగారిన కులాల ఉద్యమ రథసారథి భారత దేశ చరిత్రలో 30 సంవత్సరాలు ఎమ్మార్పీఎస్ పోరాటం తెలుగు నేల మీద ఈదుములోడిలో పుట్టిందని, మాదిగ దండోరా ఉద్యమం దేశంలో నూతన సామాజిక విప్లవాన్ని సృష్టించిందని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ళ నరసింహ మాదిగ అన్నారు. జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని గ్రామ గ్రామాన ప్రతి మాదిగ ఎమ్మార్పీఎస్ జెండాను త్రికరణ శుద్ధితో ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. మాదిగల ఆత్మగౌరవ కవాతును శ్రద్ధతో ఆత్మవిశ్వాసంతో నిర్వహించాలని సూచించారు. గత 30 సంవత్సరాలుగా ప్రజల విశ్వాసాన్ని ఆధార అభిమానాలను పొంది సుదీర్ఘకాలంగా నిలబడిన రాజకీయేతర ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ ఉద్యమం అని అన్నారు. అందరికన్నా అట్టడుగున ఉన్నవారికి న్యాయం చేకూరినప్పుడే రాజ్యాంగానికి ఒక అర్థం ఉంటుంది డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ స్పూర్తితో భారత దేశంలో మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఉద్భవించిన మహా ఉద్యమం మాదిగ దండోరా ఉద్యమం అన్నారు. సామాజిక అస్తిత్వ ఉద్యమాల్లో దండోరా ఉద్యమం చారిత్రకమైనదని అన్నారు. మాదిగ మరియు ఉపకులాల్లో ఆత్మస్థైర్యం ఆత్మగౌరవానికి నాంది పలికిందనీ మాదిగ ఉపకులాలే కాకుండా దోపిడీకి అణచివేతకు గురైన కులాల్లో కూడా పోరాట స్ఫూర్తిని నింపిన ఉద్యమం మాదిగ దండోరా ఉద్యమం అని అన్నారు. ఆవిర్భావ దినోత్సవం ప్రతి ఒక్కరు డ్రెస్ కోడ్ తెల్ల షర్టు నల్ల ప్యాంటు నల్ల కండువా విధిగా ధరించాలని కోరారు.

Related posts