బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్… కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
-కారు దిగి చెయ్యికి షేక్ హ్యాండ్ ఇచ్చినా గద్వాల ఎమ్మెల్యే
హైదరాబాద్ జులై 06 (ప్రజాక్షేత్రం):బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార కాంగ్రె స్ పార్టీలో చేరుతుండగా.. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహా రాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి.గత కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. అయితే, ఆయన్ను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపత య్య, వారి అనుచరులు ఆందోళనకు దిగారు. కొందరు ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలపడంతో పాటు, పెట్రోల్ పోసుకుంటా మని హెచ్చరించారు. గతంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశా రు. అయినా కార్యకర్తలు ససేమిరా అంనడంతో..సీఎం రేవంత్ రెడ్డి రంగం లోకిదిగి సరితా తిరుపత య్యతోపాటు స్థానిక కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడినట్లు తెలిసింది. కృష్ణ మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చినా మీకు సముచిత స్థానం ఇస్తామని సరిత తిరుపతయ్యకు రేవంత్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రూట్ క్లియర్ కావడంతో శనివారం సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షిల ఆధ్వర్యంలో గద్వాల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.