వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. ఎంపీడీవో వెంకయ్య గౌడ్…
శంకర్ పల్లి జులై 06(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండలంలోని అన్ని గ్రామాలలో వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక ఎంపీడీవో వెంకయ్య గౌడ్ తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, గ్రామపంచాయతీ ఇంచార్జ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో మొత్తం లక్ష 50 వేల మొక్కలను నాటాలని తెలిపారు. ప్రతి గ్రామంలో ఈత, మునగ, టేకు తదితర మొక్కలను నాటాలన్నారు. ప్రతి గ్రామంలో 6 వేల మొక్కల చొప్పున నాటాలని తెలిపారు. ఇది ఒక బృహత్తర కార్యక్రమమని అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వనమహోత్సవం కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ నాగభూషణం, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామపంచాయతీ ఇన్చార్జి అధికారులు పాల్గొన్నారు.