Praja Kshetram
తెలంగాణ

డా.జగ్జీవన్ రామ్ గారికి భారత రత్న ప్రకటించాలి – ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ…

డా.జగ్జీవన్ రామ్ గారికి భారత రత్న ప్రకటించాలి – ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ…

 

 

తాండూరు జులై 06(ప్రజాక్షేత్రం): శనివారం తాండూర్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు‌. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాట్లాడుతూ దేశ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన వారిలో ముందు వరుసలో వున్నవారు బాబు జగజీవన్ రామ్ … స్వాతంత్ర పోరాటంలో విద్యార్థి నాయకుడిగా ఆయన కృషి ఎనలేనిది గాంధీ మార్గంలో గాంధీ ఆలోచనకు అనుగుణంగా ఆయన మార్గంలో ముందుకు సాగిన వారిలో బాబూజీ ఒకరు స్వాతంత్రం అనంతరం దాదాపు పదిసార్లు పార్లమెంట్ సభ్యులు 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా రక్షణ శాఖ. వ్యవసాయ శాఖ. లాంటి అనేక పదవులు అధిరోహించి దేశానికి ఎనిలేని సేవలందించినటువంటి మహనీయుడు డా ‘బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఆయన సేవలకు గౌరవంగా భారతరత్న ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ తరఫున బిజెపి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమని జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ అన్నారు. ఆయన ఆశలకోసం ముందుకు సాగాలని ముందు తరాల ఆయన చరిత్రను తెలుసుకోవాలనీ గుర్తుచేశారు….ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్ మాదిగ. జిల్లా ఉపాధ్యక్షులు మల్కప్ప మాదిగ. జిల్లా కార్యదర్శి అంజి మాదిగ. ఎం ఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ శివాజీ మాదిగ. కో కన్వీనర్ అజయ్ మాదిగ. ఎం ఎస్ ఎఫ్ నాయకులు శ్రీకాంత్. నజీర్. నవీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts