జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం
-జర్నలిస్టుల సంక్షేమానికి అండగా నవనాథపురం ప్రెస్ క్లబ్
ఆర్మూర్ జులై 06(ప్రజాక్షేత్రం): ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టులకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేందర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు .ఈ ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు అశోక్ రెండు నిమిషాల పాటు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్ టియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షులు సంజీవ్ లు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి నవనాథపురం ప్రెస్ క్లబ్ అండగా ఉంటుందని అన్నారు .జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కై పోరాడుతామన్నారు .జర్నలిస్టులు ఐక్యతతో ఉండి సమస్యల సాధనకు ముందుండాలని పిలుపునిచ్చారు. సమావేశమ అనంతరం జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం జర్నలిస్టుల సంక్షేమ ని దృష్టిలో పెట్టుకుని నవనంతపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఆర్మూర్ పట్టణంలోని ప్రముఖ శ్రీ బాలాజీ ఐ కేర్ ఆస్పత్రి నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది .అవసరం ఉన్నవారికి ఉచితంగా మందులను పంపిణీ చేస్తూ కళ్ళజోలను అందించారు ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సేవలో ఉండే జర్నలిస్టులో సేవలందించడం ఆనందంగా ఉందని అన్నారు .ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి నవనాతపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కార దిశగా మార్గాలు అందించే జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలను ప్రెస్ క్లబ్ సభ్యులకు అందించే విధంగా కృషి చేద్దామని అన్నారు. జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందించిన డాక్టర్ నరేష్ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా జర్నలిస్టుల ఆరోగ్య సమస్యల దృశ్య ఉచితంగా సేవలు అందించడానికి మరికొంతమంది వైద్యులు ముందున్నారని త్వరలో వారి సేవలను వినియోగించుకొని క్లబ్ సభ్యులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ముద్ర కోలా వినోద్, జనరల్ సెక్రెటరీ మహేష్ కుమార్ ,క్యాషియర్ గోదురు మహిపాల్, కార్యవర్గ సభ్యులు రాజేందర్ ,దినేష్ ,సురేష్ బాబు ,టి యు డబ్ల్యూ ఉపాధ్యక్షుడు సంజీవ్ పార్థ o,సీనియర్ పాత్రికేయులు సాత్పూర్ శ్రీనివాస్ ,విన్సెంట్ ,గణేష్ గౌడ్, శ్రావణ్ ,చరణ్ గౌడ్ ,బారడు ,గణేష్ గటాడి అరుణ్ ,షికారి శ్రీనివాస్ ,మిరియాల వెంకటేష్ ,చిరంజీవి, ముఖేష్ ,సురేష్ ,లిక్కి శ్రావణ్ ,అశోక్ ,వినోద్, రాజ్ కుమార్ ,కిరణ్ ,నితీష్ తదితరులు పాల్గొన్నారు.