Praja Kshetram
తెలంగాణ

*బాసర త్రిబుల్ ఐటీ లో ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ*

 

 

 

 

నిజామాబాద్ జులై 06(ప్రజాక్షేత్రం): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరు 12 మంది విద్యార్థులు బాసర త్రిబుల్ ఐటీ లో ఎంపికైన సందర్భంగా ఆలూరు మాజీ సర్పంచ్ కళ్లెంమోహన్ రెడ్డిఅభినందన సభ నిర్వహించారు.ఇట్టి సభకు ప్రధాన ఉపాధ్యాయులు ఎం నరేందర్ గారు అధ్యక్షత వహిస్తూ త్రిబుల్ ఐటీ అభినందనలు తెలుపుతూ వారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటదని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు కళ్ల మోహన్ రెడ్డి పూర్వ మాజీ సర్పంచ్ సంతోష్ రెడ్డి ఎంపిటిసి మల్లేష్ వి డి సి సభ్యులు అన్నపూర్ణ ట్రస్ట్ ఆర్మూర్ అధ్యక్షులు రాజన్న ఘనంగా సన్మానించారు. మాజీ సర్పంచ్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికై 150000 రూపాయలను మరియు విద్యార్థులకు 10/10 జిపిఏ సాధించిన వారికి మరియు త్రిబుల్ ఐటీ సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి 15 ఆగస్టు రోజున అందిస్తామని అన్నారు. త్రిబుల్ ఐటీ కి ఎంపికైన విద్యార్థులు భవజ్ఞ రశ్మిత చరణ్య సవిత దేవానంద్ సదానంద్ చాముండేశ్వరి సంజన దీక్షిత అర్చన కావ్య శ్రీ మధు ఇట్టి కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ దుమ్మాజీ శ్రీనివాస్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts