Praja Kshetram
తెలంగాణ

ఆర్మూర్ నియోజకవర్గానికి 1.25 కోట్ల నిధులను మంజూరు.

ఆర్మూర్ నియోజకవర్గానికి 1.25 కోట్ల నిధులను మంజూరు.

-పొద్దుటూరు వినయ్ రెడ్డి మంత్రి సీతక్కని కలిసి 1.25 కోట్ల నిధులు మంజూరు.

-నందిపేట్ మండలం పలు కార్యక్రమాలకు నిధులు మంజూరు.

ఆర్మూర్ జులై 07(ప్రజాక్షేత్రం): తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క వారిని కలిసి ఆర్మూర్ నియోజకవర్గానికి 1.25 కోట్ల నిధులు మంజూరు చేపించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డి. పలు కార్యక్రమాలకు మంజూరు అయినవని తెలిపారు. నందిపేట్ మండలం కాలుపూర్ గ్రామంలో ఎస్సీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పొడిగింపు కు 50 లక్షల రూపాయలు,అలాగే నందిపేట్ మండల కేంద్రంలోని గౌడ్ ఫంక్షన్ హాల్ కోసం 25 లక్షల రూపాయలు,నందిపేట్ మండలంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ కోసం 25 లక్షల రూపాయలు, నందిపేట్ మండలం కేంద్రంలో మైనార్టీ ఫంక్షన్ హాల్ కోసం 25 లక్షల రూపాయలు,మంత్రి సీతక్కను అడిగిన వెంటనే నిధులను మంజూరు చేసిన మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి తెలిపారు.

Related posts