అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఘటనపై సిపిఎం దిగ్భ్రాంతి.
-మృతుడి కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్.
-ఘటనపై విచారణ జరపాలని డిమాండ్.
విజయవాడ జులై 07(ప్రజాక్షేత్రం): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడడం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతి చెందిన వారి కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని.. వారికి ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించి, ప్రాణాలు కాపాడాని కోరింది. గాయపడిన తీవ్రతను బట్టి పరిహారాన్ని అందించాలని.. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. గాయపడిన వారిని సిపిఎం బృందం ఆసుపత్రిలో పరామర్శించింది. మెరుగైన వైద్యం అందిచాలని వైద్యులును కోరింది.