Praja Kshetram
తెలంగాణ

తెలంగాణలో 26మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు … కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.

తెలంగాణలో 26మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు … కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.

 

 

కరీంనగర్ జులై 07(ప్రజాక్షేత్రం): తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన 26 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బీజేపీ లో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని.. అందుకే వాళ్లు తర్జనభర్జన అవుతున్నారన్నారు. ఈడీ, సీబీఐ కేసులున్న నేతలను బీజేపీలోకి తీసుకునే అవకాశాల్లేవని చెప్పారు. ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు, బీజేపీకి సంబంధం ఉండదని, నరేంద్రమోదీ ప్రభుత్వం అవినీతి పరులను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ఎంపీ కేశవరావుతో రాజీనామా చేయించిన కాంగ్రెస్ నేతలు… ఆ పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదు? కాంగ్రెస్ పాలన నిజంగా బాగుంటే… పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరాలన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా అన్ని స్థానాల్లో బీజేపీయే గెలుస్తుందన్నారు. బీఆరెస్‌ సర్కార్ చేసిన అక్రమాలను ఆ పార్టీ నేతలను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెసోళ్లు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఇంకా అభిప్రాయ సేకరణ జరగలేదని.. త్వరలో పార్టీ నూతన అధ్యక్షుడిని అధిష్టానం ప్రకటిస్తుందన్నారు.

*విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంల భేటీపై…*

గత కేసీఆర్ ప్రభుత్వం విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నా రాజకీయ లబ్ది కోసం మరింత జఠిలం చేసి సమస్యను నాన్చుతూ వచ్చారని సంజయ్ ఆరోపించారు. ఇప్పుడు ఆ అవసరం లేదని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యతతో ఉన్నారని, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యల పరిష్కారం లభించే అవకాశముందన్నారు.. ఇప్పటికే కేసీఆర్ గోతికాడ నక్కలా ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలా? అని ప్రయత్నిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ అవకాశం ఇవ్వొద్దని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నానన్నారు. సీఎం లు చర్చించుకున్న విషయాలు మా దృష్టికి రావాలి కదా అని, రెండు రాష్ట్రాలు సానుకూలంగా ఉండడం మంచిదేనన్నారు.

*రామాయణ్ సర్క్యూట్, కరీంనగర్..హసన్ పర్తి రైల్వే లేన్ పై….*

రామాయణ సర్క్యూట్ కింద ఇల్లంతకుంట ,కొండగట్ట అలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతామని, ప్రతిపాదనలు పంపాలని గత ప్రభుత్వాన్ని అనేకమార్లు కోరినా కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరించారన్నారు. కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదన్నారు. కరీంనగర్ -హాసన్ పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే జరిగింది. రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలోనే రైల్వే లేన్ నిర్మాణంపై నిర్ణయం జరుగుతుందన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి అడిగితే స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగించలేదని, రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి వచ్చిన విజ్ఝప్తుల మేరకే కేంద్రం గడువు పొడిగించిందని స్పష్టం చేశారు. గడువు పొడిగింపుతో కరీంనగర్ కార్పొరేషన్ కు మరిన్ని నిధులు వచ్చే అవకాశముందని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తాన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. స్మార్ట్ సిటీ పనుల గడువు పెరగడం వల్ల కరీంనగర్ కి మరిన్ని నిధులు వస్తాయన్నారు. రేవంత్ ఒక్కడే అడిగితే స్మార్ట్ సిటీల అభివృద్ధి గడువు పొడిగించలేదు… వివిధ రాష్ట్రాల సీఎంలు అడిగారని కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడ కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. వేములవాడ ఆలయాన్ని ఈసారి ప్రసాదం స్కీంలో చేర్చుతామన్నారు. రామాయణ సర్క్యూట్ కింద ఇళ్లందకుంట, కొండగట్టు దేవస్థానాలను చేర్చాలని ప్రతిపాదన ఉందన్నారు. కరీంనగర్ హాసన్ పర్తి రైల్వే లైన్ సర్వే పూర్తయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు భాగ్య నరగ వాసులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండి ట్విటర్‌లో “ఆషాడ మాసం అమ్మవారి బోనం.” అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ. ఈ ఆషాఢంలో పోతన కీర్తించిన అమ్మవారిని పూజిస్తే మనల్ని చల్లగా చూస్తుంది. అమ్మవారి చల్లని చూపు మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ. అమ్మవారి ఆశీస్సులతో సమాజం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ హిందూ బంధువులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. బండి సంజయ్ రాశారు.

Related posts