Praja Kshetram
తెలంగాణ

ఆలూర్ మండల కేంద్రానికి 1.43 కోట్ల నిధులు మంజూరు. 

ఆలూర్ మండల కేంద్రానికి 1.43 కోట్ల నిధులు మంజూరు.

 

-పొద్దుటూరి వినయ్ రెడ్డి ద్వారా నిధులు మంజూరు.

-30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కొరకు..

-మంత్రి దామోదర్ రాజ నర్సింహకు మండల ప్రజలు కృతజ్ఞతలు.

ఆలూర్ జులై 08(ప్రజాక్షేత్రం): ఆలూర్ మండల కేంద్రంలో జననేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఆలూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు వైఎస్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆలూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ మాట్లాడుతూ ఆలూర్ మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి అక్షరాల ఒక కోటి నలభై మూడు లక్షల రూపాయలు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహని ఒప్పించి నిధులు మంజూరు చేయించడం జరిగింది. కావున వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రంలో గల వెంకటేశ్వర్ గుట్ట ప్రదేశంలో ఉన్న స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఆలూర్ మండల కేంద్రానికి నిధులు మంజూరు చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ వారికి అలాగే ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డికి ఆలూరు మండలం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు నల్మెలా మోహన్ రెడ్డి, సభ్యులు కళ్లెం మల్లారెడ్డి, నవనీత్, కాంగ్రెస్ నాయకులు ములకిడి శ్రీనివాస్, రాజేందర్,ముత్యం రెడ్డి,మోతే శ్రీనివాస్,భాస్కర్,ఉమ్మడి గంగారెడ్డి, కళ్లెం చంటి, అలాగే కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Related posts