వైద్యం వికటించి బాలుడు మృతి.
-పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో ఘటన.
-ఆసుపత్రి ముందు రోధిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు.
-గత నాలుగు రోజులుగా డెంగ్యూతో బాధపడుతున్న బాలుడు(మనీశ్వర్).
చేవెళ్ల జులై 09(ప్రజాక్షేత్రం): వైద్యం వికటించి ఓ బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగింది. చేవెళ్ల మండల కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన సంబంధించి తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…చేవెళ్ల మండల పరిధిలోని చన్ వెళ్లి గ్రామానికి చెందిన కుర్వ శ్రీనివాస్,సంతోషాలకు ఇద్దరు కుమారులున్నారు.మనీశ్వర్(11), వర్షిత్ లు నాలుగు రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మనీశ్వర్ మృతి చెందాడు. మరో బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. అయితే బాలుడు వైద్యం వికటించి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు , బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతిచెందాడని ధర్నా, ఆందోళనలు చేశారు. మనీశ్వర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరైయ్యారు. ఆ బాలుడు తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించాయి.