Praja Kshetram
తెలంగాణ

మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ.. అమ్మాయిలతో గలీజు దందా

మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ.. అమ్మాయిలతో గలీజు దందా

-మొయినాబాద్ ఫాం హౌస్ లో ముజ్రా పార్టీ భగ్నం చేసిన పోలీసులు

-మహిళలు ఢిల్లీ ప్రాంతానికి చెందినవారుగా గుర్తింపు.

మొయినాబాద్ జూలై 09(ప్రజాక్షేత్రం): మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫాం హౌస్ లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి .వారాంతాల్లో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని ఫామ్‌ హౌస్‌లలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కథనాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నజీబ్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో గల సాగర్ రిట్రీట్ ఫామ్ హౌస్ లో అర్దరాత్రి ఢిల్లీ కి చెందిన ఇద్దరు అమ్మాయిలు, హైదరాబాద్ కు చెందిన ఇద్దరమ్మాయిలతో ముజ్రాపార్టీ జరిగింది. అసభ్య నృత్యాలు, అర్ధనగ్న డ్యాన్సులతో ముజ్రాపార్టీ నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడి చేసి (సెమీ న్యూరిటీ డాన్స్)ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు . అందులో 6గురు పురుషులు నలుగురు మహిళలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అందులో ఈ పార్టీని అరేంజ్ చేసిన ఈ నలుగురి విక్టిమ్స్ ను తీసుకవచిన్న వ్యక్తి రెహమాన్ సిద్ధ చౌహన్ అని విచారణలో తేలింది . ఈ వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్లు అతనితోపాటు తన ఐదుగురి స్నేహితులను తీసుకొచ్చినట్టు తెలిసింది.ముగ్గురు మహిళలు ఢిల్లీ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరు కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో స్థిరపడి డాన్సర్లుగా వృత్తిని నిర్వహిస్తు ఒక మహిళ హైదరాబాద్ ప్రాంతానికి చెందినది సింగర్ గా గుర్తించినట్టు తెలుస్తుంది. ఆరుగురు పురుషులు టోలిచౌకి ప్రాంతానికి చెందిన ముస్లిం మధ్యతరగతి వ్యక్తులు వీరు వృత్తిపరంగా మటన్ షాపులు నిర్వహించే వ్యక్తులు గా పోలీసులు నిర్ధారించారు. మొయినాబాద్ శివారు ప్రాంతాల్లో కుప్పలు తిప్పలుగా వెలసిన ఫామ్ హౌస్ లలో పార్టీల పేరుతో రోజుకు ఒక్క గలీజ్ దందాలు నిర్వహిస్తున్నారని  గతంలో మొయినాబాద్ శివారు ప్రాంతంలో హత్య ఘటనలు జరిగాయని ఈ ప్రాంతంలోని ఫామ్ హౌస్ లపై పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అర్ధరాత్రి అసభ్యకర పార్టీ ఘటన వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్ట నిర్వహిస్తున్నారని, అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్సులు వేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌వోటీ పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న ఏడుగురు యువకులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ముజ్రా పార్టీ కోసం యువతులను ఢిల్లీ నుంచి తీసుకొచ్చారని చెప్పారు. అసభ్య నృత్యాలు, అర్ధనగ్న డ్యాన్సులు చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. వారిని మొయినాబాద్‌ పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. కాగా, వారాంతాల్లో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని ఫామ్‌ హౌస్‌లలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. కాగా మొయినాబాద్ మండలంలోని 111 జీవోను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలను కడుతుంటే అన్ని తెలిసిన సంబంధిత అధికారులు అడ్డుకోకుండా మౌనం వహించడం వల్లనే అక్రమ నిర్మాణాలు చేపట్టి వాటిని అడ్డు చెప్పకపోవడం వల్లనే ఈ అసాంఘిక కార్యకలాపాలకు మొయినాబాద్ మండలం అడ్డగా మారిందని స్థానికులు వాపోతున్నారు.

Related posts