Praja Kshetram
క్రైమ్ న్యూస్

పాచి పనికి వచ్చి.. పక్కాగా స్కెచ్..అందిన కాడికి దోచుకుని దేశం దాటుతున్న దొంగలు

పాచి పనికి వచ్చి.. పక్కాగా స్కెచ్..అందిన కాడికి దోచుకుని దేశం దాటుతున్న దొంగలు

 

-అందిన కాడికి దోచుకుని దేశం దాటుతున్న దొంగలు.

-సీసీ కెమెరాల సహాయంతో అంతర్జాతీయ నేరస్తులను పట్టుకున్న పోలిసులు.

-13.5 తులాల బంగారం, రూ 25 వేలు స్వాధీనం.

-నేపాల్ దొంగల ముఠా సరికొత్త ప్లానింగ్.

-నేపాల్ దొంగల ఆట కట్టించిన షాద్ నగర్ పోలీసులు.

రంగారెడ్డి జిల్లా జులై 09(ప్రజాక్షేత్రం): వారంతా నేపాల్ దేశానికి చెందిన వారు….పట్టణంలోని సంపన్నుల ఇండ్లే వారి టార్గెట్.. అనుకున్న పథకం ప్రకారం తమ ముఠా లోని సభ్యురాలిని సంపన్నుల ఇంట్లో పాచి పనికి పంపుతారు.. కొంత కాలం పాచి పనిచేస్తూ ఇంటి యాజమానుల కథలికలను పసిగట్టి మిగతా ముఠా సభ్యులకు సమచారం ఇవ్వడం ఆమెపని.. ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకుని దర్జాగా ఇంటి ని లూటీ చేసి దేశం విడిచి పారిపోవడం మిగతా ముఠా సభ్యుల పని.. ఇదే తరహాలో పట్టణంలో దొంగ తనానికి పాల్పడ్డ అంతర్జాతీయ నేరస్తులను అరెస్టు చేసి షాద్ నగర్ పోలిసులు వారి ఆట కట్టించారు. పోలిసుల కథనం ప్రకారం నేపాల్ దేశానికి చెందిన ప్రసన్న బదువాల్ పట్టణంలోని అయ్యప్ప కాలనీ కి చెందిన గాదం రమేశ్ ఇంట్లో పాచి పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక పథకం ప్రకారం పనిలో చేరిన ప్రసన్న జూన్ 30 న ఇంటి యజమాని కుటుంబ సభ్యులతో కలసి బందువుల దగ్గరకు వెళ్లరనే సమచారం తమ ముఠా లోని మిగతా సభ్యులైన తన భర్త ప్రశాంత్ బధువాల్ తో పాటు కృష్ణ పశుపతి, బీమ్ సాహి, ఆకాశ్ లకు సమచారం ఇచ్చింది. వెంటనే తమ ముఠా సభ్యులు ఇంట్లో ఎవరూ లేరని తెలసి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 9 తులాల బంగారం తో పాటు 2 లక్షల నగదును దోచుకెళ్లారు. అదే రోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన యాజమాని గదం రమేశ్ ఇంటి తాళాలు పగిలిపోయి ఉండటం చూసి బంగారం, నగదు కనిపించక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారని షాద్ నగర్ పోలిసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి పిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఇంట్లో పాచి పని చేసే ప్రసన్న బద్వాల్ ను అదుపులోనికి తీసుకొన్నారు. పోలీసులు తమదైన స్టైల్ లో అనుమానితురాలిగా ఉన్న పనిమనిషిని ప్రశ్నించగా వాస్తవాలు బయటపడ్డాయి. పట్టణంలోని అయ్యప్ప కాలనీతో పాటు సాంబశివ కాలనీలో దొంగతనానికి పాల్పడినట్లు, ముఠా లోని మిగతా సభ్యులు దొంగతనం చేసిన వెంబడే నేపాల్ దేశానికి వెళ్లిపోతారని తర్వాత ఆ సొమ్మును సమానంగా పంచుకుంటామని తెలిపింది. నిందితురాలైన ప్రసన్న బడువాల్ తో పాటు ఆమె భర్త ప్రశాంత్ బదువాళ్ ను అరెస్టు చేసిన పోలిసులు వారి నుండి 13.5 తులాల బంగారంతో పాటు 25న స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మిగతా సభ్యులను త్వరలోనే అరెస్టు చేయనునట్లు తెలిపారు. శంషాబాద్ డిసిపి రాజేష్ పర్యవేక్షణలో అడిషనల్ డీసీపీ రాజ్ కుమార్, సైబరాబాద్ క్రైమ్ డిసిపి నరసింహ, అడిషనల్ డిసిపి నరసింహారెడ్డి, సిసిఎస్ ఏసిపి శశాంక్ రెడ్డి, షాద్ నగర్ ఏసిపి రంగస్వామిల నేతృత్వంలో షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్, సిసిఎస్ శంషాబాద్ సిఐ పవన్, ఎస్సై అవినాష్, సిసిఎస్ సిబ్బంది సత్యనారాయణ రెడ్డి, మహేందర్, కుమార్, సంజీవ్ ఆధ్వర్యంలో కేసు విచారణ అధికారిగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.రామిరెడ్డి, పిసి మోహన్, కర్ణాకర్, యాదగిరి, జాకీర్, రాజు, రఫీలు దొంగతనం కేసును చేదించడంలో కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు.

Related posts