Praja Kshetram
ఆరోగ్యం

హార్ట్ ఎటాక్‌కు నెలరోజుల ముందు కనిపించే సంకేతాలు ఇవే!

హార్ట్ ఎటాక్‌కు నెలరోజుల ముందు కనిపించే సంకేతాలు ఇవే!

 

 

ఇంటర్నెట్ డెస్క్ జులై 09(ప్రజాక్షేత్రం): ప్రపంచవ్యాప్తంగా హృద్రోగబాధితుల సంఖ్య పెరుగుతోంది. జీవనశైలి మార్పుల కారణంగా అనేక మంది చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యా్న్ని పదికాలాల పాటు కాపాడుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హృద్రోగాలకు సంబంధంచి అవగాహన పెంచుకోవాలి. వ్యాధి లక్షణాలు ఏంటి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, వంటి అంశాలపై అవగాహన ఉంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. వైద్యులు చెప్పే దాని ప్రకారం, హార్టెటాక్ వచ్చేందుకు నెల ముందు నుంచే శరీరంలో పలు మార్పులు వస్తాయట. అవేంటో ఓసారి చూద్దాం.

భారతీయులపై సంచలన అధ్యయనం.. దేశంలో ప్రస్తుతం సగం మంది పరిస్థితి ఇదే

హార్ట్ ఎటాక్‌కు ముందు చాలా మందిలో ఛాతి పట్టేసినట్టు, ఒత్తిడి పెట్టినట్టు ఉంటుందట. చాలా రోజుల ముందుగానే ఈ ఇబ్బంది మొదలవుతుందట.

తగినంత ఆహారం, నీరు తీసుకుంటున్నా నిత్యం నీరసం ఆవహించినట్టు ఉంటే కూడా సందేహించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు ఊపిరాడనట్టు ఉండటం, ఛాతిలో నొప్పి వంటివి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కడుపులో తిప్పడం, అరగనట్టు ఉండటం వంటివి కూడా గుండెపోటుకు నెల రోజుల ముందు నుంచే ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాయి. కొందరిలో అతిగా చెమటపోయడం కూడా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్‌కు ముందు శరీరంలోని ఇతర భాగాల్లో కూడా నొప్పి అనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. వీపు, భుజాలు, చేతులు, మెడ, దవడ వంటి చోట్ల నొప్పి అనిపిస్తుందని అంటున్నారు.కాబట్టి వీటిని సాధారణ నొప్పుల్లా భావించకుండా ఇబ్బంది కలిగిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే రాబోయే ప్రమాదం నుంచి సులువుగా తప్పించుకోవచ్చని అంటున్నారు.

Related posts