పర్మిషన్ లేకుండానే ప్రహరీ గోడ ఏర్పాట్లు.
-తాసిల్దార్ ఆపిన ఆగని పనులు.
-ఒక ఎకరా నాలుగు కోట్ల విలువైన పొలంలో పనులు.
-కొలని నవీన్ రెడ్డి189 సర్వే నెంబలో అక్రమాలు.
-పట్టించుకోని పంచాయతీ సెక్రెటరీ.
-కేసు నమోదు చేసి ఆధారాలు ఇచ్చిన ఆగని పని.
-ప్రొబిటెడ్ లో ఉన్న ప్రభుత్వ ఆదాయనికి గండి.
-సంబంధిత మండల,జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి.
కొండాపూర్ జూలై 09(ప్రజాక్షేత్రం): మండల పరిధిలోని మనసాన్పల్లి గ్రామ సర్వేనెంబర్ 189 పట్ట భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అగ్రికల్చర్ భూమిలో నాన్ అగ్రికల్చర్ పనులు ధరణి ఆన్లైన్ పెండింగ్ పనిలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్మాణ పనులు చేయవద్దని పలుమార్లు చెప్పిన నిర్లక్ష్యం చేస్తూ పోలీసు డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి అక్రమంగా నిర్మాణం చేస్తున్న ప్రహరి గోడ నిర్మాణ పనులు ఆపమని పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తకుండా నిర్లక్ష్యంగా డూప్లికేట్ బు యజమాని కొలను నవీన్ రెడ్డి కోనాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది యువకులను అడ్డుపెట్టుకొని ఆ భూమిపై కేసు నమోదు చేసిన యధావిధిగా రెవెన్యూ, గ్రామపంచాయతీ అనుమతులు లేకుండానే అగ్రికల్చర్ భూమిలో నాన్ అగ్రికల్చర్ పనులు అనగా ప్రహరీ గోడ నిర్మించిన యజమాని పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అన్నారు.
*రెవెన్యూ అధికారుల వివరణ*
కేసు నమోదు అయిన అగ్రికల్చర్ పొలంలో నిర్మాణ పనులు చేయొద్దని చెప్పిన మా మాట వినకుండా అక్రమాలకు పాల్పడ్డ వారిపై తగిన చర్యలు తీసుకుంటాం.
*పంచాయతీ సెక్రెటరీ వివరణ*
ప్రహరి గోడతో మాకు ఎటువంటి సంబంధం లేదు అలాంటి నిర్మాణాలకు మేము ఎలాంటి నోటీసు ఇవ్వము. పై అధికారులు ఎలా చెప్తే అలా వింటాం.కావున సంబంధిత అధికారులు ఇకపై అక్రమాలకు పాల్పడ్డాయి తగు చర్యలు తీసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులతోపాటు అన్యాయం జరిగిన పక్క పొలం వారు ఫిర్యాదు చేశారు.