పానుగంటి సత్యం కి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళి.
దమ్మపేట జూలై 09(ప్రజాక్షేత్రం):ఇటీవల మరణించిన దమ్మపేట సీనియర్ నాయకులు స్వర్గీయ పానుగంటి సత్యం గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వారి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారు .వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తెలుగుదేశం పార్టీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి పానుగంటి సత్యం ముఖ్య అనుచరులుగా ఉన్నారు.వీరి వెంట కాంగ్రెస్ నాయకులు కేదసి వెంకటేశ్వరరావు,పగడాల రాంబాబు, వలీపాషా, వెంకటరామారావు,రూప వంశీ,పిట్టల శ్రీను తదితరులు పాల్గొన్నారు.