సిఐ జితంత్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి.
-ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం సభ్యులు.
చేవెళ్ల జులై 09(ప్రజాక్షేత్రం):రాష్ట్ర అధ్యక్షులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం ఉపాఅధ్యక్షులు కాదారం వినయ్, బేగరి రాజు మంగళారం నాడు హైదరాబాద్ లో ఎస్సీ ఎస్టీ కమిషనర్ ఆఫీస్ లో కమిషన్ సభ్యులను కలిసి మాట్లాడుతూ ఎస్సీ కులానికి చెందిన అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మరణానికి కారకుడైన,సీఐ జితేందర్ రెడ్డి, తోపాటు ఐదుగురు, కానిస్టేబుళ్ల పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి,ఉద్యోగాల నుండి తొలగించి అరెస్టు చేయాలని ఎస్సై భార్య శ్రీరాములు కృష్ణవేణికి, ప్రభుత్వపరంగా ఉద్యోగం కల్పిస్తూ కోటి రూపాయల నష్టపరిహారం పిల్లలకు ప్రభుత్వము ఉచితంగా విద్యను అందించాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాడారం వినయ్ కుమార్ కోరారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్యాగరి రాజు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో, విధులు నిర్వహిస్తున్న ఎస్సీ కులానికి చెందిన, ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ గారు, విధి నిర్వహణలో క్రమశిక్షణతో పని చేస్తున్నారన్న పేరుంది, పోలీసు ఉద్యోగాన్ని అంకితభావంతో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న శ్రీరాముల శ్రీనివాసు మరణానికి కారకుడు కుల అహంకారి సిఐ, జితేందర్ రెడ్డి పై గతంలో కూడా పోలీస్ చట్టం పరమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.సుభాని, శేఖర్ ,శివ నాగరాజు, ఉమెన్ పి సి నాగరాణి,ను కూడా ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ వృత్తిపరమైన పనులు చెబితే పనులు చేయకుండా, సిఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుల్ లకు సహకరించినట్లు, ఎస్సై మరణ వాంగ్మూలంలో వీడియో రికార్డు ద్వారా తెలిపినారు, సిఐ జితేందర్ రెడ్డి, మరియు ఐదుగురు కానిస్టేబుల్స్ ఎస్సై ఎస్సీ కులానికి చెందిన వారు అన్న కారణంగా కులం పేరుతో మానసిక వేదనకు గురిచేసి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైనారు, డీఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదు చేసిన, పట్టించుకోకపోవడం బాధాకరం, సీఐ జితేందర్ రెడ్డి, ఐదుగురు కానిస్టేబుల్ ద్వారా అవమానాలకు గురై, ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కోశాధికారి ప్రమోద్ రాష్ట్ర సహాయా కార్యదర్శి అప్పలరాజు, మీడియా కార్యదర్శి యాదగిరి, పంజాగుట్ట స్టాచ్ కమిటీ అధ్యక్షులు పుణ్య భాను గేట్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు దినేష్ తదితరులు పాల్గొన్నారు.