బల్లిపడిన టిఫిన్లు – చిట్టెలుకలు తిరిగే చట్నీలు.. కాంగ్రెస్ మార్క్ మార్పు అంటే ఇదేనా?
-సంక్షేమ హాస్టళ్లలో సమస్యలపై కేటీఆర్ మండిపాటు.
హైదరాబాద్ జులై 10(ప్రజాక్షేత్రం): “మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అన్నారని, మొత్తానికి.. కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారని ట్విటర్ వేదికగా బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైటర్లు వేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి..పురుగుల అన్నం.. నీళ్ల చారు.. అయితే ఈనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి..బల్లిపడిన టిఫిన్లు – చిట్టెలుకలు తిరిగే చట్నీలు అని ఇదేనా కాంగ్రెస్ మార్పు అని కేటీఆర్ ప్రశ్నించారు. మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో.. కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతమైందని, మంగళవారం కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడి..20 మంది విద్యార్థులకు వాంతులయ్యాయని పేర్కోన్నారు.