Praja Kshetram
తెలంగాణ

నిరుద్యోగుల ఆందోళన వెనక దాగి ఉన్న కుట్ర ,ఐపీఎస్ లతో కమిటీ ఏర్పాటు చేసి కుట్ర కోణంపై విచారణ చేపట్టాలి.

నిరుద్యోగుల ఆందోళన వెనక దాగి ఉన్న కుట్ర ,ఐపీఎస్ లతో కమిటీ ఏర్పాటు చేసి కుట్ర కోణంపై విచారణ చేపట్టాలి.

 

-ప్రైవేట్ శిక్షణ కేంద్రాల మాఫియా ఉంది.

-తల్లుల పుస్తెలతాలు తాకట్టుపెట్టి శిక్షణ తీసుకున్నారు.

-పరీక్షలు వాయిదా వేస్తే వారి జీవితాలు ఏం కావాలి?

-టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్.

హైదరాబాద్ జులై 10(ప్రజాక్షేత్రం): నిరుద్యోగుల ఆందోళన వెనక కుట్రదాగి ఉందని పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. ఐపీఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి కుట్ర కోణంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల ఆందోళనల వెనుక ప్రైవేట్ శిక్షణ కేంద్రాల మాఫియా ఉందన్నారు. తమ తల్లులు పుస్తెల తాళ్లను తాకట్టు పెట్టి ఏళ్ల తరబడి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యారని, ఇప్పుడు నోటిఫికేషన్లు వాయిదా వేయాలంటూ దుర్మార్గమైన డిమాండ్ ముందుకు తెచ్చి వారి జీవితాలతో చెలగాటమాడుతారా..? అని మధుయాష్కి బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని,. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగ కల్పన కోసం నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షల షెడ్యూలు విడుదల చేశామన్నారు. నిరుద్యోగులు స్వేచ్ఛగా పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారని, పరీక్షలు వాయిదా వేయాలని అనడంలో కుట్ర కోణం దాగి ఉందన్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ట్రైనింగ్ సెంటర్ల స్వార్థం ఉందని తెలిపారు. శిక్షణ పేరుతో కోట్లాది రూపాయల మాఫియా నడుస్తోందని ఆరూపించారు. పరీక్షలు వాయిదాలు వేస్తే.. ఫీజుల పేరుతో నిరుద్యోగుల రక్తం తాగుదామని చూస్తున్నారన్నారు. రాజకీయ నిరుద్యోగులుగా మారిన బీఆర్ఎస్ నాయకులు.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను ఉసిగొలుపుతున్నారన్నారు.

Related posts