ఎన్నికల్లో పట్టుబడ్డ 8551 లీటర్లు మద్యాన్ని ధ్వంసం…
-పోలీస్ స్టేషన్ సమీపంలో జెసిబి తో మద్యం సీసాలు ద్వంసం……
మొయినాబాద్ జూలై10(ప్రజాక్షేత్రం): గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్సైజ్ మరియు పోలీస్ సిబ్బందికి పట్టుబడ్డ మద్యాన్ని బుధవారం పోలీస్ స్టేషన్లోని రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్, అడిషనల్ డిసిపి విజయ్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ శ్రీనివాస్ రెడ్డి, సిఐ ప్రదీప్, మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ రెడ్డి సమక్షంలో 8551 లీటర్ల మధ్య అని బుధవారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బెల్ట్ షాపుల్లో రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తొమ్మిది పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డ మద్యం బాటీలను డిప్యూటీ కమిషనర్ ప్రపోజల్ అండ్ ఎక్సైజ్ ఆర్డర్ ప్రకారం పంచుల సమీక్షంలో ద్వంసం చేశామని తెలిపారు. రాజేంద్రనగర్ డివిజన్లో 333 ఎక్సైజ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటిల్లో బీర్లు, విస్కీ, రకరకాల మద్యం సీసాలోను ఉన్నాయి. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3028 లీటర్లు, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 570 లీటర్లు, మహిళా దేవరపల్లి పరిధిలో 765.38 లీటర్లు, శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 1200.34, మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో 888.34, జవెల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 1140 లీటర్ల మద్యాన్ని ఎక్సైజ్ మరియు పోలీసులకు పట్టుబడింది అని వాటిలో బుధవారం పోలీస్ స్టేషన్ ఆధారంగా తీసుకొని ఎక్సైజ్ నిబంధన ప్రకారం ఆప్కారి నిబంధన ప్రకారం పంచుల పూర్తిచేసుకుని ఎక్సైజ్ అధికారులకు సమక్షంలోనే మద్యం బాటిల్లను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.