అవినీతి అనకొండ జీవీఎంసీ కమిషనర్ సాయికాంత వర్మ.
విశాఖపట్నం జూలై 10(ప్రజాక్షేత్రం):మహా విశాఖ నగర పాలక సంస్ధ ( జీవీఎంసీ) కమీషనర్ గా అత్యంత దారుణంగా బరితెగించి అవినీతికి పాల్పడి జీవీఎంసీకి వేల కోట్లు గండి కొట్టిన సాయి కాంత వర్మ నిర్ణయాలు వ్యవహారాలపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండు చేశారు. రాష్ట్ర్రంలో వైసీపీ ప్రభుత్వం ఘోర ఓటమి చెందిన తరవాత కూడా కేవలం లంచాల కోసం వైసీపీ నేతలు చెప్పిన పనులు, ఫైళ్లకు అధిక ప్రాధాన్యత నిచ్చి సాయికాంత వర్మ అనుమతులు మంజూరు చేశారని బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. మర్రిపాలెంలో కరన్ ఉద్యోగ్ డెవలపర్స్ సంస్ధ నాలుగు ఎకరాలకు , పరవాడలో ప్రక్రుతి ఎవిన్యూ సంస్ధకు చెందిన తొమ్మిది ఎకరాలకు, అనకాపల్లి సమీపంలోని కొప్పాక వద్ద వీ వీ ఫై సంస్ధకు ,సుజాత నగర్ లో ప్రభుత్వ స్ధలం ఆక్రమించి చేస్తున్న నిర్మాణానికి సాయికాంత వర్మ డీమ్డ్ అప్రూవల్ ఇచ్చేశారంటే ఎంత బరితెగించారో అర్ధం చేసుకోవచ్చని అన్నారు,వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలకంటే దారుణంగా వ్యవహరించి, స్వంత నిర్ణయాలతో రెచ్చిపోయిన సాయికాంత్ వర్మ వ్యవహారాలపై విచారణ జరపాలని కోరారు, ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ నొల్లి నూకరత్నం,జోనల్ మీడియా కోఆర్డినేటర్ బైరెడ్డి పోతన్నరెడ్డి పాల్గొన్నారు.