పవన్ ఫోటోలు పెట్టినట్టే భట్టి ఫోటోలు కూడా పెట్టాల్సిందే…
యాదాద్రి, జూలై 11(ప్రజాక్షేత్రం): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని మాజీ మంత్రి మోత్కపల్లి నర్సింహులు గురువారం దర్శించుకున్నారు. అనంతరం అభిమానులతో తన జన్మదినం సందర్భంగా సన్నిధి హోటల్‌లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ… ‘‘గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బిక్షమయ్యగౌడ్, బీర్ల ఐలయ్యలకు సపోర్ట్ చేసి గెలిపించా. లంచాలు, ఫైరవీలు డబ్బుపై ఆశ లేకుండా నా హయాంలో పాలన చేశా. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో నాకు పోటీ చేసే అవకాశం రాలేదదు. తెలంగాణలో నేను ఎక్కడ పోటీ చేసినా నాకు పది వేల ఓట్ల మేజారీటీ వస్తుంది. నాకు యాదగిరిగుట్టలో అర్ధ గజం భూమి లేదు… ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. ఇప్పుడున్న ఎన్నికల్లో కోట్లకు విలువ ఉంది, ప్రజలకు సేవ చేసిన వాడికి విలువ లేదు. బడుగు బలహీన వర్గాల వారి తరఫున నేను ఎల్లప్పుడూ పోరాడుతానే ఉంటా’’ అని ఆయన స్పష్టం చేశారు.
*రెడ్లకే ప్రాధాన్యత…*
బీసీలలో ముదిరాజులు, గౌడ్స్, పద్మాశాలిలు ఉన్నా వారందరిని పక్కన పెట్టి రెడ్లకే ప్రాధాన్యత ఉందని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎంతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫోటోలు అన్ని ఆఫీసులలో ఉండాలని అక్కడి సీఎం జీవో రిలీజ్ చేశారన్నారు. తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు సమానంగా దళిత ఉపముఖ్యమంత్రి అయిన భట్టి వికమార్క ఫోటోను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. తన భవిష్యత్తు కార్యచరణ పోరాటమే తప్ప ఏమీలేదని మోత్కుపల్లి నర్సింహులు వెల్లడించారు.