Praja Kshetram
తెలంగాణ

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య.

 

 

శంకర్‌ పల్లి జులై 11(ప్రజాక్షేత్రం): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75వ వన మహోత్సవం కార్యక్రమం గురువారం శంకర్‌ పల్లి మున్సిపల్ పరిధి ఎమ్మెన్నార్ కాలనీలో చేపట్టారు. వనమహెూత్సవం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ మరియు కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పకృతిని పరిరక్షించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని కాపాడాలన్నారు. మొక్కలు పెంచడం వల్ల సమయానికి వర్షాలు కురిసి పంటలు పండే అవకాశం ఉంటుందన్నారు. పెంచకపోవడం వల్ల జీవకోటి మనగడకు ప్రమాదం వాటిల్లుతుందన్నారు. మొక్కలు జీవకోటి మనుగడకు తల్లి పాత్ర పోషిస్తాయని అన్నారు. రానున్న రోజుల్లో నీడను ఇచ్చే చెట్లతో పాటు వన్యప్రాణులకు పండ్లు ఫలాలు ఇచ్చే చెట్లను పెంచుతాం అని అన్నారు. వన మహోత్సవంలో నాటిన మొక్కలను కాపాడే బాధ్యత మన అందరి బాధ్యత అని తెలిపారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో ప్రతి కాలనిలో పచ్చదనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేల మొక్కలు, పూల చెట్లను నాటాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టాలి అని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మేనేజర్ అంజన్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ జయరాజ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts