Praja Kshetram
తెలంగాణ

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలి….

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలి….

 

మొయినాబాద్ జూలై 11(ప్రజాక్షేత్రం): పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు ఎర్రవల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈనెల 22న చలో కలెక్టరేట్ విజయవంతం చేయాలని మొయినాబాద్ పట్టణ కేంద్రంలో కళాశాలలో కరపత్రాలు విద్యార్థులకు పంచడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు ఎర్రవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8214 కోట్ల రూపాయల స్కాలర్ షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ తక్షణమే చలించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో సుమారు 730 కోట్లు విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ బకాయి ఉన్నాయని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు విద్యకు చేసే కుట్ర జరుగుతుందని దీన్ని ఎస్ఎఫ్ఐ తిప్పి కొడుతుందని అన్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని పాతాలోనికి తొక్కి పడేశారని అదే గతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు పెండింగ్ స్కాలర్ షిప్స్ ఫీజు రియంబర్స్ మెంట్ అన్నారు. ఈనెల 22 తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని పదివేల మంది విద్యార్థులతో దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts