మా స్థలం మాకు ఇప్పిచండి…
అక్రమనిర్మాణం పై బాధితుల ఆందోళన..
విశాఖపట్నం జూలై 11 (ప్రజాక్షేత్రం):కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ దౌర్జన్యంగా అక్రమ నిర్మాణం చేస్తున్న రాజా జ్యువెలర్స్ అధినేత శ్రీనివాసరావు పై చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాన్ని తొలగించి మా స్థలాన్ని రక్షించాలని బాధితులు హెచ్. శకుంతలా దేవి గుప్తా, భరద్వాజ్ గుప్తా లు మీడియా ముందు మొరపెట్టుకున్నారు. కురుపాం మార్కెట్ వద్ద 2015 నుండి వివాదంలో ఉన్న స్థలం దౌర్జన్యంగా కోర్టు ఆర్డినెన్స్ ను ధిక్కరిస్తూ నిర్మాణం చేస్తున్నారని అన్నారు. అడ్డుకున్న తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పత్రాలపై ఉన్న డాక్యుమెంట్స్ ను నకిలీ పత్రాలతో తమ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం సాగిస్తున్నారని మండిపడ్డారు. 70 గజాల సుమారు రూ. 50 లక్షలు విలువైన ఈ స్థలం కోర్టులో సెటిల్మెంట్ అయ్యేవరకు నిర్మాణం ఆపాలని కోరారు.