Praja Kshetram
పాలిటిక్స్

కాంగ్రెస్‌ గూటిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.

కాంగ్రెస్‌ గూటిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.

 

 

హైదరాబాద్ జులై 12(ప్రజాక్షేత్రం): బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ.ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో హస్తం పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్చాన్ని అందించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తాజా చేరికతో మొత్తం 8 మంది కాంగ్రెస్‌లో చేరినట్టయింది. కాగా మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.

Related posts