Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు.

మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు.

 

 

అమరావతి జులై 12(ప్రజాక్షేత్రం): ఏపీ మాజీ సీఎం జగన్‌పై గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. 120బీ, 166, 167, 197, 307, 326, 465, 504(34) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గత సీఎం జగన్ ఒత్తిడితోనే తనను అక్రమంగా అరెస్ట్ చేసి, సునీల్‌కుమార్ వేధిం చారంటూ కంప్లయింట్‌లో పేర్కొన్నారు రఘురామ కృష్ణరాజు. కస్టడీ సమయం లో తనపై సునీల్‌కుమార్ హత్యాయత్నం చేశారని ఆరోపించారు. దీంతో ఏ1గా ఐపీఎస్ సునీల్‌కుమార్, ఏ2గా ఐపీఎస్ సీతారామాంజ నేయులు, ఏ3గా జగన్‌ పేరును చేర్చారు పోలీసులు.

Related posts