Praja Kshetram
తెలంగాణ

పర్యావరణాన్ని కాపాడటం మన అందరి బాధ్యత.

పర్యావరణాన్ని కాపాడటం మన అందరి బాధ్యత.

-పాఠశాల ఆవరణలో చెట్లు నాటిన ఏ సి పి బస్వా రెడ్డి,అడ్వకేట్ భూపతి రెడ్డి.

 

ఆర్మూరు జూలై 12(ప్రజాక్షేత్రం): శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఆర్మూరు పాఠశాల లో శుక్రవారం రోజున వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. పర్యావరణాన్ని పరిరక్షించి భావి తరాలకు తోడ్పాటుగా ఉండే ఉద్దేశ్యం తో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాల ఆవరణలో చెట్లు నాటడం జరిగినది. సీనియర్ అడ్వకేట్ భూపతి రెడ్డి మాట్లాడుతూ పాఠశాల ప్రారంభం లో భవన నిర్మాణానికి తమ వంతుగా చేసిన సహాయ సహకరాలను గుర్తు చేశారు.వన మహోత్సవ కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటడం అని కాకుండా ప్రతి ఒక్కరూ తమరి పుట్టిన రోజుకో లేదా పండుగ సందర్భంగా అయినా చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.తదుపరి ఏ సి పి బస్వా రెడ్డి మాట్లాడుతూ మనిషి పర్యావరణం నుండే వచ్చి పర్యావరణాన్ని నాశనం చేసే దిశగా వెళ్తునాడని ,చెట్లు నాటడం వాళ్ళ పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతం అని తెలిపారు.ప్రతి ఒక్క విద్యార్థి మంచి భవిష్యత్తు కోసం విద్యా బుద్దులను నేర్వలని,సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాఠశాల సంచాలన సమితి అధ్యక్షులు సీనియర్ బిజెపి లీడర్ మరియు సీనియర్అడ్వకేట్ భూపతి రెడ్డి , ఏ సి పి ఆర్మూరు బస్వా రెడ్డి,పాఠశాల జిల్లా సెక్రటరీ రవినాథ్, ప్రభంద కారిణి కమిటీ అధ్యక్షులు వంశీ,సెక్రటరీ మహేష్,వైస్ ప్రెసిడెంట్ జనార్దన కిరణ్,పాఠశాల పూర్వ విద్యార్థులు ,పాఠశాల ప్రిన్సిపాల్ వినోద్ కుమార్ ముద్ర కోల, మేనేజ్మెంట్ అభిమన్యు, మాతాజీ లు, శైలజ ,సోనాలి, శ్రీ విద్యా, సిందుజ, లత, వేద, నిహారిక, అంజలి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts