111 జీవో కు తూట్లు, అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడ.
-111 జీవోకు విరుద్ధంగా 30 ఎకరాలకు అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడ.
-వాగులపై అక్రమంగా బ్రిడ్జిలు.*
-ప్రహరీ గోడ నిర్మాణానికి ఓ పెద్దమనిషి రిపోర్టర్ల పేర్లతో లక్షల్లో వసూలు. చేసినట్టు గ్రామంలో గుసగుసలు.
-గ్రామపంచాయతీ మూడు నోటీసులు ఇచ్చిన ఆగని నిర్మాణం పనులు.
-అర్ధరాత్రి ప్రారంభించి ఉదయం వరకు నిర్మిస్తున్నారు.
ఆపేదెవరు దమ్ముంటే రావాలని అక్రమ నిర్మాణదారుల సవాళ్లు.
-ఆందోళనలో చుట్టుపక్కల రైతులు.
మొయినాబాద్ జూలై 12(ప్రజాక్షేత్రం):త్రిబుల్ వన్ జీవోకు తూట్లు పొడుస్తున్నారు. జీవో నిబంధనలను తుంగలో తొక్కుతున్న అక్రమ నిర్మాణదారులు. త్రిబుల్ వన్ జీవో కు విరుద్ధంగా 30 ఎకరాలకు అక్రమంగా అనుమతులు లేకుండా పెద్ద పెద్ద పిల్లర్లు పెంతు భీములు వేసి కాంక్రీట్ సీకులతో బందోబస్తుగా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు. ఆ భూమిలో నుండి ఉన్నటువంటి వాగులు సైతం లెక్కచేయకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వాగులపై ఇష్టానుసారంగా నచ్చినట్లు వంతెనలు బ్రిడ్జిలు కట్టి వాగు ఇరువైపులా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. మొయినాబాద్ మండలంలోని సురంగల్ గ్రామ రెవెన్యూ లో ఉన్నటువంటి సర్వేనెంబర్ 251, 282,275,272,271 280,281 లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రహరీ గోడ నిర్మించొద్దంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి 111 జీవో కు విరుద్ధంగా పంట పొలాల్లో పట్టా భూములలో ప్రహరీ గోడలు నిర్మించోద్దంటూ మూడు నోటీసులు ఇచ్చినా వాటిని లెక్కచేయకుండా అక్రమంగా జబర్దస్త్ తో ప్రహరీ కూడా నిర్మాణం.. గ్రామంలో ఓ పెద్దమనిషి నేను అందర్నీ మేనేజ్ చేస్తాను అని చెప్పి ప్రహరీ గోడ నిర్మిస్తున్న వారి వద్ద లక్షల్లో వసూలు చేసినట్లు గ్రామంలో గుసగుసలాడుతున్నారు. గ్రామపంచాయతీ నోటీసులను లెక్కచేయకుండా అర్ధరాత్రి నుంచి మొదలు పెడితే ఉదయం వరకు అతివేగంగా రాత్రికి రాత్రే ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారు. అధికారులు ఆపాలని చెప్పినా ఆపకుండా ఎవడొస్తాడో చూస్తాం ఎవరినైనా ఎదుర్కొంటాం వాళ్ళ అంతు చూస్తాం దమ్ముంటే వచ్చి గోడను టచ్ చేసి చూడామని అక్రమ నిర్మాణదారులు సవాల్ విసిరుతున్నారు. వివరాల్లోకి వెళితే మొయినాబాద్ మండలంలోని సురంగల్ గ్రామంలో ఉన్నటువంటి సర్వేనెంబర్ 275, నుండి 282 వరకు దాదాపు 25 ఎకరాల నుంచి 30 ఎకరాల వరకు భూమిని కొనుగోలు చేసి వాటిలో పెద్దపెద్ద రోడ్లను వేసి వేలవేల గజాలలో వాటిని విభజించి భవిష్యత్తులో అక్రమంగా జిల్లాల కోసమో లేదా అక్రమ నిర్మాణాల కోసము సిద్ధం చేస్తున్నారు కాగా ఈ పొలాల మధ్య నుంచి వాగుంది వాటిపై నిర్మాణం చేసినట్లు చుట్టుపక్కల రైతులు ప్రహరీ గోడ నిర్మిస్తున్నట్లు వాటిపై బ్రిడ్జిలు కడుతున్నట్లు విలేకరులకు సమాచారం అందించిన వెంటనే వార్త విలేకరు జనవరి 21-1-2024 వార్తా కథనాలు వార్త పేపర్ లో రావడంతో మండలములో ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డి ఈ,,నుంచి మొదలుకొని వర్క్ ఇన్స్పెక్టర్ వరకు అందరూ వచ్చి పూర్తిగా వాగును పరిశీలించి తేదీ 6-2-2024 నాడు ఇరిగేషన్ అధికారులతో సహా రెవెన్యూ అధికారులు సర్వేయర్ ఆర్ఐ లు వచ్చి పూర్తిగా కొలతలు చేసి ఇక్కడ ఎలాంటి ప్రహరీ గోడలు నిర్మించొద్దని వాగుపై వంతెనలను కట్టొద్దని ఎవరి అనుమతులు తీసుకొని ఈ నిర్మల చేపట్టారని ప్రశ్నించి పూర్తిగా మాకు రిపోర్ట్ అందింతవరకు మీరు ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పినా అక్రమ నిర్మాణదారులు చుట్టుపక్కల 30 ఎకరాలకు ప్రహరీ కూడా నిర్మిస్తున్నారు. దీంతో చుట్టూ ఉన్నటువంటి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎంత పెద్ద ప్రహరీ గోడలు నిర్మిస్తే పక్కనే ఆనుకొని ఉన్నటువంటి మా పంట పొలాల్లో వర్షాకాలంలో వరదలు వచ్చి పంటలు మునిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు. దీన్ని పై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు గగోలు పెడుతున్నారు. అధికారులు కనుక చర్యలు తీసుకోకపోతే మేము చెమటోడ్చి కష్టపడి పండించిన పంటలు నేలపాలు అవుతాయని దయచేసి అధికారులు వెంటనే వచ్చి ఈ ప్రహరీ గోడలను తొలగించాలని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
*ఇరిగేషన్ మొయినాబాద్ మండల ఏఈ లక్ష్మి స్పందన.*
మేము వార్త కథనాల్లో వచ్చినటువంటి వార్తను చూసి ఫీల్డ్ మీదికి వెళ్లి పరిశీలించిన తర్వాత మేము రెవెన్యూ వాళ్ళతో సర్వే చేయించి సర్వే రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నామని అప్పటివరకు వాగుపై అక్రమంగా నిర్మించినటువంటి బ్రిడ్జిలను కాంపౌండ్ వాళ్లను ఎవరి అనుమతులు తీసుకున్నారని అక్కడ ఉన్న వారిని ప్రశ్నించి ఎలాంటి కట్టడాలు ఇక్కడ చేయకూడదని వాగుపై వంతెన కట్టకూడదని చెప్పామని రెవెన్యూ వారు రిపోర్ట్ ఇస్తే వెంటనే హద్దులు చూసుకొని వాటిని కూల్ చేస్తామని అన్నారు.
*పంచాయతీ అధికారి డి. ఎల్. పి. ఓ.. సతీష్ స్పందన.*
త్రిబుల్ వన్ జీవో లో పర్యావరణాన్ని రక్షించడానికి 111 జీవో అమలులో ఉందని జీవో నిబంధనల ప్రకారం పండించే పంట పొలాల్లో ప్రహరీ గోడలు నిర్మించోదని చుట్టుపక్కల రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని వాటిని అధిగమించి నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని చట్టం అందరికీ సమానంగా ఉంటుందని గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి మూడు నోటీసులు జారీ చేశామని ఇంకా వినకుండా వారు నిర్మాణాలు చేపడితే డిమాలిష్ నోటీసు ఇచ్చి అక్రమ నిర్మాణాల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అప్పటికి వినకుండా అధికారులు లేని సమయంలో నిర్మాణాలు చేపడితే వారిపై కేసులు కూడా నమోదు అవుతాయని అన్నారు.
*మొయినాబాద్ తహసిల్దార్ గౌతమ్ కుమార్ స్పందన*
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కోరిన విధంగా సురంగల్ రెవెన్యూలో వాగు సంబంధించినటువంటి సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే యొక్క పూర్తి రిపోర్టులు సోమవారం ఇరిగేషన్ అధికారులకు అందజేయడం జరుగుతుందని మొహీనాబాద్ తాసిల్దార్ గౌతమ్ కుమార్ తెలిపారు.