Praja Kshetram
తెలంగాణ

సీజనల్ వ్యాధుల నివారణకై ప్రతి శుక్రవారం ఫ్రైడే – డ్రై డే కార్యక్రమం: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్.

సీజనల్ వ్యాధుల నివారణకై ప్రతి శుక్రవారం ఫ్రైడే – డ్రై డే కార్యక్రమం: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్.

 

 

శంకర్‌ పల్లి జులై 13(ప్రజాక్షేత్రం): దోమలు పుట్టకుండా చూసుకుందాం డెంగ్యూని తరిమికొడదామని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. డెంగ్యూ మరియు మలేరియా సీజనల్ వ్యాధుల నివారణకై ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంట్లోనూ ఇంటి ఆవరణలోనూ ఎక్కడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో మేనేజర్ అంజన్ కుమార్, అనూష, చంద్రశేఖర్, స్రవంతి పాల్గొన్నారు.

Related posts