విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి:కొమ్ము లోకేశ్వర్.
రాజేంద్రనగర్ జులై 12(ప్రజాక్షేత్రం): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను సర్దుబాటు చేయాలని టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ అన్నారు. శుక్రవారం ఉన్నత పాఠశాల మైలార్ దేవ్ పల్లి రాజేంద్రనగర్ మండలంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్య లు తీసుకుని ఉపాధ్యాయుల సర్దుబాటు చేసి, ఖాళీల స్థానంలో విద్యావలంటీర్లను నియమించాలని కోరారు. అదేవిధంగా పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి స్కావాంగర్ లను అపాయింట్ చేయాలి. చాలా పాఠశాలలో ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు నూతన పాఠశాలలో జాయిన్ కాలేరు అట్టి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందదు. కాబట్టి ప్రభుత్వం లెఫ్ట్ ఓవర్ వేకెన్సీలను అపాయింట్ చేయాలి. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి కంటే విద్యార్థులు ఎక్కువ ఉన్న పాఠశాలలకు విద్యా వాలంటీర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.