Praja Kshetram
తెలంగాణ

ఒక మంచి నాయకుని కోల్పోయాం.

ఒక మంచి నాయకుని కోల్పోయాం.

 

 

శంకర్ పల్లి జులై 13(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి మండలంలోని కొండకల్ గ్రామానికి చెందిన అండూరి పెంటయ్య శనివారం ఉదయం మరణించారు. ఈ వార్త తెలిసి ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీమ్ భరత్ వారి పార్థివ దేహాన్ని పరామర్శించి నివాళులు అర్పించి మరియు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఏళ్ల వేళలా వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వీరి పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు వన్నం నర్సింహా మాదిగ, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ, శంకర్ పల్లి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి , ఉదయ్ మోహన్ రెడ్డి, లక్ష్మయ్య, నర్సింలు, శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు దళిత బహుజన సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related posts